News December 1, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం పర్యటన.. ఎప్పుడంటే?

భామిని మండలంలో ఈ నెల 5న సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు సీఎంవో కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 8:20 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి 10:20 గం.కు భామినిలోని హెలీ ప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడనుండి 10:30కు ఏపీ మోడల్ పాఠశాలకు రోడ్డు మార్గంలో చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు పాఠశాలలో జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:10 గంటలకు తిరుగుపయనమవుతారు.
Similar News
News December 1, 2025
కల్వకుర్తి: GPO ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినయ్

కల్వకుర్తిలో జరిగిన గ్రామ పాలనా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సభలో వినయ్‌ను నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొట్ర క్లస్టర్ జిపిఓగా పనిచేస్తున్న వినయ్, 2019లో TSPSC ద్వారా VROగా ఎంపికయ్యారు. ఉద్యోగుల సమస్యల కోసం కట్టుబడి పనిచేస్తారన్న నమ్మకంతో ఆయనను పదవికి ఎంపిక చేసినట్లుగా అధికారులు తెలిపారు. అనంతరం ఉద్యోగులు, మిత్రులు శాలువా కప్పి సన్మానించారు
News December 1, 2025
గోదావరిలో మునిగి వెంకటపూర్ వ్యక్తి మృతి

మంథని మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన పంచిక సదానందం (44) ఆదివారం ఉదయం గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. బోనాల సందర్భంగా ఆరెంద గ్రామ సమీపంలోని నదికి వెళ్లిన అతడు నీటిలో కొట్టుకుపోయాడు. గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మంథని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 1, 2025
పేదలకు వరం.. ఖమ్మం జీజీహెచ్‌లో పేస్‌మేకర్ సర్జరీ

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పేద ప్రజలకు భారీ ఖర్చుతో కూడిన పేస్‌మేకర్ సర్జరీ ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. గుండె కొట్టుకునే వేగం తగ్గిన తిరుమలాయపాలెంకు చెందిన 67ఏళ్ల దామెర వెంకన్నకు డాక్టర్ సీతారాం, డాక్టర్ జియా నేతృత్వంలోని వైద్య బృందం నవంబర్ 30న శాశ్వత పేస్‌మేకర్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ ఈ వైద్య బృందాన్ని అభినందించారు.


