News October 21, 2025
పార్వతీపురం మన్యం: మీ సేవలు మరువం..!

రేయింబవళ్లు కష్టపడి శాంతిభద్రతలను కాపాడే రక్షభటులకే కొన్ని సందర్భాల్లో రక్షణ కరువవుతోంది. పార్వతీపురం జిల్లాలో సీఐ ముద్దాడ గాంధీ, ఏ.ఆర్ కానిస్టేబుల్ షేక్ ఇస్మాయిల్, సివిల్ కానిస్టేబుల్లు బి.శ్రీరాములు, సీహెచ్.చిరంజీవిరావు, ఎస్.సూర్యనారాయణ విధుల్లో ఉండగా ప్రాణాలు విడిచారు. నేడు ‘పోలీసు అమరవీరుల సమస్మరణ దినోత్సవం’ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ పార్వతీపురంలో స్మృతి పరేడ్ నిర్వహించనున్నారు.
Similar News
News October 21, 2025
Asia Cup: నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్!

ACC చీఫ్ నఖ్వీ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి BCCI సిద్ధమైంది. Asia Cup ట్రోఫీని భారత్‌కు అప్పగించాలంటూ మెయిల్ పంపింది. ఇవ్వకపోతే ICCకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. నఖ్వీ నుంచి స్పందన రాకపోతే విషయాన్ని ఐసీసీ ఎదుటే తేల్చుకుంటామని బీసీసీఐ సెక్రటరీ సైకియా అన్నారు. నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ తీసుకోవడానికి భారత క్రికెటర్లు నిరాకరించడంతో ఆయన ట్రోఫీని వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
News October 21, 2025
చిత్తశుద్ధి, నీతి, నీజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది: CP

ప్రజల సేవ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు పాటుపడాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందన్నారు.
News October 21, 2025
VKB: పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: ఎస్పీ

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ప్రజలకు ఉన్నత సేవలు అందించే వారు పోలీసులని, వారి సేవలను వెలకట్టలేమని ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి మాట్లాడారు. అమరుల త్యాగాలు మరువలేనివని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.