News January 31, 2025

పార్వతీపురం: మార్చి 8 వరకు మీ కోసం కార్యక్రమం రద్దు

image

జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్ కోడ్ జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ ముగిసినంత వరకు మీకోసం ( ప్రజా సమస్యల పరిష్కార వేదిక ) కార్యక్రమం నిలుపుదల చేయనున్నట్లు కలెక్టర్చ జిల్లా ఎన్నికల అధికారి ఎ. శ్యామ్ ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తునట్లు ఆయన స్పష్టం చేశారు.

Similar News

News February 22, 2026

భద్రాద్రిలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలి: డీఎఫ్‌ఓ

image

కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు డీఎఫ్‌ఓ కృష్ణ గౌడ్ ధ్రువీకరించారు. గతంలో సంచరించిన పులి కాకుండా, ఇది కొత్తదని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పశువుల కాపర్లు, రైతులు అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఎక్కడైనా పులి పాదముద్రలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

News February 22, 2026

సీసీ కెమెరాల నిఘా పెంచాలి: ఎస్పీ

image

రంజాన్ మాసం నేపథ్యంలో నంద్యాలలో సీసీ కెమెరాలు నిఘా మరింత పెంచాలని ఎస్పీ సునీల్ షోరాణ్ పోలీసులకు సూచించారు. శనివారం విజిబుల్ పోలింగ్‌లో భాగంగా నంద్యాలలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బొమ్మలసత్రం, ఆర్టీసీ బస్టాండ్, భైర్మల్ విధి, శ్రీనివాస సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

News February 22, 2026

అయోడిన్ లోపంతో మహిళల్లో ఎన్నో సమస్యలు

image

అయోడిన్‌ మన జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి, దాన్ని థైరాయిడ్‌ హార్మోన్లుగా మారుస్తుంది. లేదంటే శరీర ఉష్ణోగ్రత, శ్వాస, గుండె వేగం, జీవక్రియ, జీర్ణక్రియ దెబ్బతింటాయి. అయోడిన్‌ లోపిస్తే గాయిటర్‌ వస్తుంది. అలాగే కొందరు మహిళల్లో రొమ్ముల్లో క్యాన్సర్‌రహిత గడ్డలు ఏర్పడతాయి. చేపలు, సీ ఫుడ్, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.