News February 6, 2025

పార్వతీపురం: మొన్న మూడు.. నిన్న నిల్..!

image

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా.. బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిట్టింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు ఇచ్చినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.

Similar News

News February 6, 2025

తూప్రాన్‌లో వ్యక్తి కుళ్లిన శవం లభ్యం

image

తూప్రాన్ పట్టణంలో ఓ ఇంట్లో వ్యక్తి కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన వడియారం మల్లేశం(48) భార్యా పిల్లలతో గొడవ కారణంగా ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన మల్లేశం ఇంట్లో 10 రోజుల క్రితం చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో ఈరోజు తలుపులు తొలగించి చూడగా మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News February 6, 2025

న్యూడ్ వీడియోల కేసు.. వారికి నోటీసులు!

image

అమ్మాయిల న్యూడ్ వీడియోల కేసు కొత్త మలుపు తీసుకుంటోంది. మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని నిన్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు చర్యలకు దిగినట్లు సమాచారం. వీడియోలో ఉన్న సినీ ప్రముఖులు, ఇతరులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌ను పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించారు.

News February 6, 2025

ఘోరం.. భర్త ఇంటిని అమ్మి ప్రియుడితో భార్య పరార్

image

భర్త కిడ్నీని అమ్మి ప్రియుడితో <<15341180>>పారిపోయిన ఘటన<<>> మరువకముందే అదే తరహాలో మరో ఉదంతం బయటకొచ్చింది. తమిళనాడు కన్యాకుమారి(D)లో బెంజమిన్(47), సునీత(45) దంపతులు. భర్త సౌదీలో పనిచేస్తుండగా, ఇంటివద్దే ఉన్న భార్య మరొకరితో సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్త ఇంటిని అమ్మేసి డబ్బుతో పారిపోయింది. దీంతో భర్త సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!