News February 9, 2025

పార్వతీపురం: యువకుడి ఆత్మహత్యాయత్నం

image

గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పార్వతీపురం మండలం కోడి గ్రామంలో జరిగింది. శంకర్ రావు ఎవరి దగ్గరైనా రూపాయి నోటు ఉంటే ఆ నోటుకు రూ.12 లక్షలు అంటూ సోషల్ మీడియలో చూశాడు. ముందుగా రూ.2 లక్షలు కడితే రూ.12లక్షలు వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. అది నమ్మి చెల్లించాడు. మోసపోయానని గ్రహించి మనస్తాపంతో శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు.

Similar News

News September 19, 2025

NMMS స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు: డీఈవో

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) కోసం విద్యార్థుల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. 2024 డిసెంబర్ 8న జరిగిన పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు, 2021, 2022, 2023లో ఎంపికైన విద్యార్థులు కూడా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో తప్పకుండా తమ దరఖాస్తులను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు.

News September 19, 2025

ఐటీఐ కోర్సులో మిగులు సీట్లు భర్తీ దరఖాస్తుల ఆహ్వానం

image

మన్యం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మిగులు సీట్లు కొరకు 4వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సాలూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ డి.శ్రీనివాస ఆచారి గురువారం తెలిపారు. ఈ నెల 27 తేదీ వరకు వెబ్ పోర్టల్ http://iti.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తరువాత ప్రింట్ తీసుకొని ఏదైనా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకువెళ్లి అప్రూవల్ తీసుకోవాలని సూచించారు.

News September 19, 2025

మెదక్: 22 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు

image

మెదక్ పట్టణంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.రాధాకిషన్ తెలిపారు. బాలికల పాఠశాలలో పదో తరగతి, బాలుర పాఠశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. పదో తరగతికి 194 మంది, ఇంటర్‌కు 524 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వివరించారు.