News April 11, 2024
పార్వతీపురం: యువకునిపై పోక్సో కేసు

బాలికను మోసం చేసి శారీరకంగా లోబరుచుకుని యువకునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై దినకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. పార్వతీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన పెంటకోట ప్రవీణ్ కుమార్ మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.
Similar News
News April 11, 2025
విజయనగరం : నేడు పిడుగులతో కూడిన వర్షాలు

విజయనగరం జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి.
News April 11, 2025
అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటిన గరివిడి క్రీడాకారులు

నేపాల్‌లో జరిగిన క్రీడల్లో గరివిడికి చెందిన క్రీడాకారులు రమణీ ప్రియ మహిళా విభాగం పవర్‌లిఫ్టింగ్‌లో 330 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం గెలిచారు. అథ్లెటిక్స్‌లో షార్ట్ పుట్, డిస్క్ త్రోలో బంగారు పతకాలు సాధించారు. పురుషల విభాగం వై.వి. ప్రసాద్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో స్వర్ణం, 50 మీటర్ల ఈత పోటీల్లో స్వర్ణం, 100 మీటర్ల ఈత పోటీల్లో రజతం సాధించారు.
News April 11, 2025
విజయనగరం జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం జిల్లాలో వాతావరణ మారింది. వేపాడ, రాజాం, వంగర, నెల్లిమర్లతో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.