News February 24, 2026
పార్వతీపురం: ‘రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలి’

రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రీ సర్వే జరిగే గ్రామాల్లోని సర్వేయర్లు తప్పనిసరిగా సంబంధిత గ్రామంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.
Similar News
News February 24, 2026
NGKL: గుడి, బడుల్లో కులవివక్షను అంతమొందించాలి: బీజేపీ

కుమ్మెర ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ నేత రామచందర్ రావు మండిపడ్డారు. గుడి, బడి వంటి బహిరంగ ప్రదేశాల్లో కులవివక్షను పూర్తిగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీ వేదికగా, ప్రజా క్షేత్రంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
News February 24, 2026
కల్తీ పాలు.. ఆరేళ్ల బాలుడు మృతి

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 6 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బాధితుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, మెరుగైన మెడిసిన్స్ ఇస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
News February 24, 2026
జగిత్యాల: అకాల వర్షం.. అన్నదాతకు తీవ్ర నష్టం

నిన్న రాత్రి ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం మామిడి, మొక్కజొన్న రైతులను దెబ్బతీసింది. రాయికల్ మండలంలోని రామాజీపేటతో పాటు జగిత్యాల గ్రామీణ, సారంగాపూర్ మండలాల్లో మామిడి పిందెలు నేలరాలగా, మొక్కజొన్న పంట నేలవాలింది. ఏళ్ల కష్టమంతా కళ్లముందే నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


