News July 18, 2024
పార్వతీపురం: రూ.80కి చేరిన టమాట

ఉమ్మడి విజయనగరం జిల్లాలో టమాటా ధర జనాలను ఠారెత్తిస్తోంది. ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.80 వరకు పలుకుతోంది. వారం రోజుల వరకు రూ.40 ధర ఉండేది. స్థానికంగా టమాటా పంట లేకపోవడంతో ఇతర ప్రదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు రవాణా ఛార్జీల భారం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ధరల నియంత్రణ పై చర్య చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 4, 2025
ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.
News November 4, 2025
విజయనగరం జిల్లాలో బాల్య వివాహాలపై అవగాహన

విజయనగరం జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికత నిర్మూలన అంశాలపై ప్రభుత్వ శాఖల సహకారంతో పనిచేయడం జరుగుతుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. ప్రసాద్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాల్యవివాహాల నిర్మూలనకు నవంబరు ఒకటవ తేదీ నుంచి వంద రోజులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెలలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయనే ఉద్దేశంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
News November 3, 2025
VZM: మొంథా బీభత్సం.. 665.69 హెక్టార్లలో పంటల నష్టం..!

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో పలు మండలాల్లో పంటలకు గణనీయమైన నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో పంట నష్టాల అంచనా పూర్తయిందని ఆయన తెలిపారు. మొత్తం 665.69 హెక్టార్లలో 3,076 మంది రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్నారని, వరి 644.03 హెక్టార్లు, మొక్కజొన్న 6.40 హెక్టార్లు, పత్తి 4.93 హెక్టార్లు, మినుములు 1.01 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు.


