News December 16, 2024

పార్వతీపురం: రేపు జిల్లాలో పవన్ పర్యటన

image

డిప్యూటీ సీఎం పవన్ 17న జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా స్థాయి అధికారులు పర్యటనకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. ఎల్విన్ పేట హెచ్ గ్రౌండ్ పరిసరాలను సోమవారం పరిశీలించారు. కురుపాం మండలం గిరిశిఖర ప్రాంతాలను సందర్శించనున్న నేపథ్యంలో హెలిపాడ్, రూట్ మ్యాప్‌ను అధికారులు తనిఖీ చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక హెచ్ గ్రౌండ్‌ను సబ్ కలెక్టర్, పాలకొండ DSP, మండల స్థాయి అధికారులు సందర్శించారు.

Similar News

News November 4, 2025

ప్రజా సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించండి: SP

image

ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 54 ఫిర్యాదులు స్వీకరించి, వాటిలో భూగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించినవని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణ స్పందనతో 7 రోజుల్లో పరిష్కారం కల్పించాలని సూచించారు.

News November 4, 2025

ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

image

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.

News November 4, 2025

విజయనగరం జిల్లాలో బాల్య వివాహాలపై అవగాహన

image

విజయనగరం జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికత నిర్మూలన అంశాలపై ప్రభుత్వ శాఖల సహకారంతో పనిచేయడం జరుగుతుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. ప్రసాద్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాల్యవివాహాల నిర్మూలనకు నవంబరు ఒకటవ తేదీ నుంచి వంద రోజులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెలలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయనే ఉద్దేశంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.