News February 11, 2026

పార్వతీపురం: విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్స్

image

షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలను అందిస్తోందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం జిల్లాలో అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫోన్ నంబరు, ఆధార్, బ్యాంకు ఖాతా, కులధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు socialjustice.gov.in/schemes వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Similar News

News February 20, 2026

నార్కట్‌పల్లి: భూ వివాదం.. కళ్లలో కారం చల్లి కత్తితో దాడి

image

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలులో భూ వివాదం రక్తపాతానికి దారితీసింది. సర్వే నంబర్ 1455 భూమిలో జెర్రిపోతుల రమేష్ తన భార్య గోరీని నిర్మిస్తుండగా, బాసాని శివ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రమేష్, అతని కుమార్తె నేహా పథకం ప్రకారం శివ కళ్లలో కారం చల్లి, కత్తితో దాడి చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై విష్ణుమూర్తి బాధితుడిని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 20, 2026

నల్గొండలో చెరువుల నవీకరణకు మోక్షం!

image

పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్ 2.0’ పథకం జిల్లాలో వేగవంతం కానుంది. ఈ పథకం కింద ఎంపిక చేసిన చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో, పనులు ప్రారంభించేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని తొమ్మిది చెరువులను తొలిదశలో ఎంపిక చేసి, వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.22.35 కోట్లను కేటాయించింది.

News February 20, 2026

NLG: హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతి!

image

జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో దస్రూ నాయక్ తెలిపారు. పరీక్షల సరళిపై ఇప్పటికే అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 27,905 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆన్‌లైన్ హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారని తెలిపారు.