News February 20, 2026
పార్వతీపురం: ‘విద్యార్థుల నుంచి కండోనేషన్ ఫీజు వసూలు చేస్తే చర్యలు’

ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు హాజరు తక్కువగా ఉందని కండోనేషన్ ఫీజు వసూలు చేయాలనిచూస్తే వారిపై చర్యలు తప్పవని పార్వతీపురం జిల్లా DIEO వై.నాగేశ్వరరావు హెచ్చరించారు. కండోనేషన్ ఫీజు ఉన్న విద్యార్థులు కూడా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవచ్చునన్నారు. ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో 17,530 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టు తెలిపారు.
Similar News
News February 20, 2026
జిల్లా రిజిస్ట్రార్‌గా జగన్మోహనరావు బాధ్యతల స్వీకారం

తూ.గో. జిల్లా నూతన రిజిస్ట్రార్‌గా కె.జగన్మోహనరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, సీనియర్ అసిస్టెంట్‌గా, గ్రేడ్-2, గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా సేవలందిస్తూ పదోన్నతిపై ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News February 20, 2026
ఏఐ వార్‌రూమ్‌కు HYD అనువైన ప్రదేశం: CM రేవంత్

హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో టెక్నాలజీ దిగ్గజాలను TG CM రేవంత్ కోరారు. ‘ఏఐ శకం ఇప్పటికే మొదలైంది. మనిషి కంటే ఇది ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంది. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారు. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. అందుకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం’ అని సీఎం వివరించారు.
News February 20, 2026
రాజకీయాల్లోకి భార్య, పిల్లలను లాగొద్దు: ప్రియాంక

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్, ఆయన భార్య ఎలిజబెత్‌కు పాక్ ఏజెంట్‌తో <<19086206>>సంబంధాలున్నాయంటూ<<>> అస్సాం సీఎం హిమంత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక ఫైరయ్యారు. రాజకీయాల్లోకి భార్య, పిల్లలను లాగడం దుర్మార్గమన్నారు. ఎవరూ ఇలా చేయకూడదని స్పష్టం చేశారు. గౌరవ్ సానుకూల, ప్రేమపూర్వక రాజకీయాలు చేస్తారని పేర్కొన్నారు. CM అనవసర విమర్శలు వదిలేసి ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని హితవు పలికారు.


