News February 27, 2026
పార్వతీపురం: వైద్య ఆరోగ్య రంగ అభివృద్ధి పనులు వేగవంతం కావాలి

జిల్లాలో నిర్మితమవుతున్న వివిధ ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. APSMIDC ద్వారా వివిధ ప్రాజెక్టుల పురోగతిపై శుక్రవారం కలెక్టరేట్‌లో వీడియో సమావేశాన్ని నిర్వహించారు. పాలకొండలో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు, సాలూరు, కురుపాం ప్రాంతాల్లో జరుగుతున్న ఇతర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
Similar News
News March 2, 2026
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తుల క్యూ ఉంది. నిన్న 83,112 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా 30,054 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. రేపు చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేయనున్నారు.
News March 2, 2026
అన్నమయ్య: కరెంట్ సమస్యలు ఉంటే కాల్ చేయండి!

అన్నమయ్య జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి APSPDCL సీఎండీ శివశంకర్ ఆధ్వర్యంలో డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నారు. వినియోగదారులు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల లోపు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.
News March 2, 2026
ASF: నైపుణ్యాలున్నా.. ఉపాధ్యాయులు లేరే..!

జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. 11 జూనియర్ కాలేజీల్లో 4,625 మంది విద్యార్థులు చదువుతుండగా ఒక్కచోట కూడా వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. ప్రభుత్వం ప్రతి కళాశాలకు ఏటా రూ.10,000లను క్రీడా నిధులకు అందిస్తోంది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలున్నా ఉపాధ్యాయుడు లేక చదువుకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి పీడీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.


