News April 5, 2025
పార్వతీపురం: ‘శని, ఆదివారాల్లో సెలవు తీసుకోరాదు’

పార్వతీపురంలోని 15 సచివాలయాల్లో రికార్డ్ పెండింగ్ పనులను పూర్తి చేసే దిశగా ఉద్యోగులు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. రికార్డు పెండింగ్ ఉన్న శని, ఆదివారాల్లో ఆ సచివాలయాల్లో ఉద్యోగులంతా తప్పకుండా విధులకు హాజరై రికార్డులు పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు శని, ఆదివారాల్లో ఈ సర్వే పెండింగ్ ఉన్న ఏ సచివాలయాలను అయినా ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశం ఉందన్నారు.
Similar News
News April 5, 2025
మరో యువతిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

AP: విశాఖలో <<15969970>>ప్రేమోన్మాది దాడి<<>> ఘటన మరువకముందే విజయనగరం(D) శివరాంలో అఖిల అనే యువతిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మంకీ క్యాప్ ధరించి ఇంట్లోకి ప్రవేశించిన అతను అఖిల కడుపులో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని స్థానికులు విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమా? మరేదైనా కారణమా? అని దర్యాప్తు చేస్తున్నారు.
News April 5, 2025
8న అనంత జిల్లాలో జగన్ పర్యటన

AP: వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి(మ) పాపిరెడ్డిపల్లిలో ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు మాజీ సీఎం.
News April 5, 2025
సిర్పూర్ (టి): పెనుగంగలో వ్యక్తి మృతదేహం

సిర్పూర్ (టి) మండలం టోంకిని గ్రామ సమీపంలోని పెన్ గంగలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. మృతుడి వయసు సుమారు 60 ఉంటుందని, సమాచారం తెలిసినవారు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.