News December 19, 2025
పార్వతీపురం: ‘సత్ప్రవర్తనతో ఖైదీలు తమ శిక్షను పూర్తి చేయాలి’

సత్ప్రవర్తనతో ఖైదీలు తమ శిక్షను పూర్తి చేయాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పార్వతీపురం సబ్ జైలును ఆమె తనిఖీ చేశారు. జైలులో వసతులను పరిశీలించి జైలు పరిస్థితులు, ఆహారం, వైద్య సౌకర్యాలు, ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 20, 2025
కృష్ణమ్మ ఒడిలో లగ్జరీ హౌస్ బోట్లు

పర్యాటక రంగానికి కొత్త కళ తెచ్చేలా కృష్ణా నదిలో లగ్జరీ హౌస్ బోట్లను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ బెర్మ్ పార్క్ నుంచి పవిత్ర సంగమం వరకు 20 కి.మీ మేర ఈ బోట్లు ప్రయాణిస్తాయి. ఏసీ, అత్యాధునిక బెడ్రూమ్‌లు, డైనింగ్ హాల్ వంటి సౌకర్యాలతో పర్యాటకులకు కేరళ అనుభూతిని అందించనున్నాయి. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.
News December 20, 2025
అపరాల పంటల్లో బంగారు తీగ కలుపు నివారణ

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.
News December 20, 2025
నంద్యాల: ALL THE BEST హసీనా, అంకిత

రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలో నంద్యాల జిల్లా క్రీడాకారులు హసీనా, అంకిత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కోచింగ్‌కు ఎంపికయ్యారు. శిక్షణలో మంచి ప్రతిభ కనబరిస్తే వారిని జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేస్తారని స్పాన్సర్ వసుంధర దేవి తెలిపారు. నంద్యాల జిల్లా నుంచి వీరిద్దరే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. చదువులో రాణిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చూపడం హర్షణీయమన్నారు.


