News March 31, 2024

పార్వతీపురం: ‘సమర్థవంతంగా ఎన్నికల నిర్వహనే లక్ష్యం’

image

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా అవసరమైన శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. EVM గోడౌన్‌ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం తనిఖీ చేశారు. సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా, పటిష్టంగా నిర్వహించేలా ప్రతీ నియోజక వర్గంలో EVM, వీవీ ప్యాట్‌లపై శిక్షణ అందించనున్నామని అన్నారు.

Similar News

News February 22, 2026

VZM: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

image

పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం (D) సంతకవిటి (M) పోతురాజుపేటకి చెందిన ఐ.దివ్య (22)కి మార్చి 7న వివాహం నిశ్చయించారు. అయితే యువతి ఈనెల 20న గడ్డిమందు తాగింది. వెంటనే రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. పెళ్లి ఇష్టం లేకనే దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

News February 22, 2026

బొబ్బిలి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

image

బొబ్బిలి పట్టణం కుమ్మరివీధిలో ఉంటున్న మర్రి మాధవిదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మాధవి చైతన్య పాఠశాలలో గణితం టీచర్‌గా పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆమెను భర్త నరేశ్ అనుమానంతో వేధిస్తున్నాడు. నీవు చనిపోతేనే దరిద్రం పోతుందని పదే పదే అనడంతో మనస్తాపానికి గురైన మాధవి శనివారం రాత్రి ఉరివేసుకుందని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు CI నారాయణరావు చెప్పారు.

News February 22, 2026

VZM: బిల్లులు ఎప్పుడు?

image

విజయనగరం జిల్లాలో పెండింగ్‌ గృహ బిల్లుల సమస్యపై లబ్ధిదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో మంజూరైన ఇళ్లకు చెల్లింపులు జరగక అనేక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. 2024లో సర్వే నిర్వహించి 24,000 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సుమారు రూ.19 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. బిల్లులు విడుదలైతే ఇళ్లను పూర్తిచేసుకునేందుకు లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.