News April 16, 2025
పార్వతీపురం: సమ్మర్ హాలీడేస్‌లో వీటిపై ఓ లుక్కేయండి

వేసవి సెలవులకు పార్వతీపురం మన్యం జిల్లా స్వాగతం పలుకుతుంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా వచ్చిన వారికి పర్యాటక ప్రాంతాలు వేదిక కానున్నాయి. సీతంపేట అడ్వెంచర్ పార్క్, తోటపల్లి ఐటీడీఏ పార్కు, సీతంపేట కడలి వ్యూ పాయింట్, తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, విశ్వేశ్వర దేవాలయం వంటి మరెన్నో పర్యాటక ప్రాంతాలను సందర్శించి మన్యం అందాల మధ్య ఆహ్లాదం పొందవచ్చు.
Similar News
News April 16, 2025
అప్పుల భారం ఉన్నా వాగ్దానాలను అమలు చేస్తున్నాం: జూపల్లి

గత ప్రభుత్వ అసంబద్ధ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గత ప్రభుత్వం కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తోందన్నారు.
News April 16, 2025
పల్నాడులో నిరక్షరాస్యులను గుర్తించాలి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో 2024-25 అందరికీ అక్షరాస్యత ( ఉల్లాస్) పథకంలో 10,164 మంది అక్షరాస్యత కల్పించామని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 30 వేల మందిని లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాస్థాయి కమిటీ సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. మెప్మా, ఎయిడెడ్, అంగన్వాడీ, ఉపాధి హామీ కూలీలలో నిరక్షరాస్యులను గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
News April 16, 2025
విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ

జిల్లాలో 69,201 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కూల్ ఐస్క్రీనింగ్‌లో 69,201 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో బాలురు 32084, బాలికలు 37117 మంది ఉన్నారన్నారు.