News November 16, 2025

పార్వతీపురం: ‘సివిల్స్‌ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్’

image

UPSC-2026 ప్రిలిమినరీ పరీక్ష కోసం అర్హులైన పేద సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థులు నవంబర్ 13 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News November 17, 2025

PDPL: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

image

PDPL(D) సుల్తానాబాద్ మం.లోని చిన్నకల్వల వద్దగల రాజీవ్ రహదారిపై కారు ఢీకొన్న ఘటనలో ఇదే గ్రామానికి చెందిన రాపెళ్లి రాజేశం(72) అక్కడికక్కడే మృతిచెందాడు. SI శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశం ఇంట్లోని చెత్తను ఇంటి ముందు ఉన్న చెత్తకుండీలో వేసి వెనుకకు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్- పెద్దపల్లివైపు అతివేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

News November 17, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> నిడిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
> కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> మెరుగైన వైద్య సేవలు అందించాలి పాలకుర్తి ఎమ్మెల్యే
> దొడ్డి కొమురయ్య త్యాగం మరువలేనిది ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
> ఆర్ఎంపి, పిఎంపి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
> చిట్టితల్లిని ఎత్తుకొని లాలించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

News November 17, 2025

సిరిసిల్ల: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన రైతు అంబిరీ లింగం(65) కరెంట్ షాక్‌తో ఆదివారం మృతి చెందాడు. లింగం కుమారుడు అంబిరీ పూర్ణ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన లింగం ఎంతకీ ఇంటికి తిరిగిరాలేదు. పొలం వద్దకు వెళ్లి చూడగా, మోటార్ స్టార్టర్ బాక్స్ వద్ద కరెంట్ షాక్ తగిలి పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు.