News December 18, 2025
పార్వతీపురం: సీఎం సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించిన ఈ సదస్సులో జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
Similar News
News December 19, 2025
పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు

AP: ప్రస్తుత జీవనశైలి, పెరిగిన ఖర్చులతో దంపతులు ఒకరిద్దరు పిల్లలకే పరిమితమవుతున్నారు. అయితే చిత్తూరు(D) ఆవల్ కండ్రిగలో ఓ జంట 21 ఏళ్లలో 14 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ఏడుగురు మగ, ఏడుగురు ఆడపిల్లలు కాగా ఓ బాలిక చనిపోయింది. 13 కాన్పులు ఇంట్లోనే జరగగా 14వ కాన్పు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో జరగడంతో ఈ విషయం బయటికొచ్చింది. ఇన్ని కాన్పులతో మహిళలకు తీవ్ర సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
News December 19, 2025
దేవరాపల్లి: బోగస్ అడ్మిషన్లపై ఇద్దరు హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు

దేవరాపల్లి మండలంలో విద్యార్థుల బోగస్ ఎన్రోల్‌మెంట్‌పై విద్యాశాఖ సీరియస్ అయింది. బొడ్డపాడు ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం, కాశీపురం లోటస్ స్కూల్ హెచ్‌ఎంలకు DEO అప్పారావు నాయుడు నోటీసులు జారీ చేశారు. బొడ్డపాడు ప్రభుత్వ పాఠశాలలో పేర్లు నమోదైన ఇద్దరు విద్యార్థులు వాస్తవానికి లోటస్ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఈ వ్యవహారంపై మరింత విచారణ చేస్తామన్నారు.
News December 19, 2025
దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 15వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు కాపీ, డాక్యుమెంట్స్‌ను JAN 27వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech, B.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.deendayalport.gov.in/


