News April 18, 2025
పార్వతీపురం: ‘స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రాను విజయవంతం చేయాలి’

శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం జరగాలన్నారు. ‘ఇ వేస్ట్ మేనేజ్మెంట్’ శీర్షికన ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
Similar News
News April 19, 2025
పెళ్లిపై నాకు నమ్మకం లేదు: త్రిష

వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని హీరోయిన్ త్రిష అన్నారు. పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని ఆమె తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. కాగా త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లోనూ ఆమె కనిపించనున్నారు.
News April 19, 2025
పాలమూరు: సాహితీవేత్తలకు పుట్టినిల్లు ఆ గ్రామం..!

NGKL జిల్లా వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామం ఉద్యమకారులు, అభ్యుదయ సాహితీవేత్తలకు పుట్టినిల్లు. 1956లో కల్వకుర్తి ప్రాంతం నుంచి వెలువడిన గడ్డిపూలు కథ సంపుటిలో కథలు రాసిన ఏడుగురు రచయితల్లో ఇద్దరు రచయితలు కోట్ల సంపత్ రావు, కోట్ల చలపతిరావు ఈ గ్రామానికి చెందిన వారే. సంపత్‌రావు 1975 ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ ఖైదీగా దాశరథి కృష్ణమాచార్య, మాకినేని బసవవున్నయ్యతో కలిసి 16నెలలు రాజమండ్రిలో జైలులో ఉన్నారు.
News April 19, 2025
మామిడి పండ్లు తింటున్నారా?

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తుచ్చేది మామిడి పండ్లే. అయితే, కార్బైడ్‌తో మాగించిన పండ్లను తింటే అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15-20 నిమిషాలు ఉంచిన తర్వాత మంచినీటితో కడిగి, ఆపై తుడిచి తినాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తొక్కను తినకపోవడమే బెటర్ అని చెబుతున్నారు. కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిదంటున్నారు.