News August 10, 2024

పార్వతీపురం: 12న నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ

image

నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) ప్రతిజ్ఞను ఈ నెల 12న పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం సంబంధిత అధికారులు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం నివారించేందుకు 2020 ఆగస్టు 15న నషా ముక్త్ భారత్ అభియాన్ అనే సామూహిక అవగాహన కార్యక్రమాన్ని సామాజిక న్యాయం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తామన్నారు.

Similar News

News October 7, 2024

విజయనగరంలో వాలంటీర్ల నిరసన

image

విజయనగరంలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు సోమవారం ఉదయం నిరసనకు దిగారు. యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వాలంటరీల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను కొనసాగించాలని కోరారు.

News October 7, 2024

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షెడ్యూల్ ఇదే

image

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఉదయం 8 గంటలకు బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

News October 6, 2024

దళారుల బారిన పడి మోసపోవద్దు: VZM కలెక్టర్

image

కేజీబీవీలో ఉద్యోగాలకు కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక ఉంటుందని, దళారులబారిన పడి అభ్యర్థులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. డబ్బులు వసూలు చేస్తున్న వారి వివరాలు తమకి తెలియజేయాలని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.