News December 18, 2025
పార్వతీపురం: 20 నుంచి ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాలు

ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం నందు డోర్ డెలివరీ మాసోత్సవాలను ఈనెల 20 నుంచి జనవరి 19 వరకు నిర్వహించనున్నట్టు పార్వతీపురం జిల్లా ప్రజా రవాణా అధికారి వేంకటేశ్వరరావు తెలిపారు. RTC లాజిస్టిక్ సర్వీస్ ద్వారా 84 ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో 10km పరిధిలో ఒక కేజీ నుంచి 50 కేజీల వరకు పార్సిల్‌ను డోర్ డెలివరీ చేయనున్నామన్నారు. ఆర్టీసీ నందు తక్కువ ధరతో అతివేగంగా, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తామన్నారు.
Similar News
News December 19, 2025
నంద్యాల: ఫొటోల మార్ఫింగ్.. ఇద్దరు మహిళల అరెస్ట్

కోవెలకుంట్ల, సంజామల, రేవనూరు, ఆళ్లగడ్డ పరిధిలోని పోలీసు అధికారుల ఫొటోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.రమేశ్ బాబు తెలిపారు. ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న వారి సమాచారం తెలియడంతో బందెల స్పందన, బందెల మారతమ్మను కోవెలకుంట్లలో అరెస్ట్ చేశామన్నారు. మార్ఫింగ్‌కు వాడుతున్న రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
News December 19, 2025
SDPT: పంచాయతీ ఎన్నికల కిక్కు.. రూ.69.95 కోట్ల అమ్మకాలు

ఓ వైపు పంచాయతీ ఎన్నికలు.. మరోవైపు కొత్త వైన్ షాపుల స్టాక్ కొనుగోళ్లతో జిల్లాలో లిక్కర్ అమ్మకాలు భారీగా కొనసాగాయి. మూడు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో మద్యం విక్రయాలు మత్తెక్కించాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.69.95 కోట్ల విలువ 74,678 కేసుల లిక్కర్,79,828 కేసుల బీర్ల విక్రయాలు సాగాయి. ఈ వారం రోజులపాటు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మద్యంపై భారీగా ఖర్చు చేసినట్టు చర్చించుకుంటున్నారు.
News December 19, 2025
NZB: కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు రూ. కోటి చెక్కు

ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన CCSకానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి చెక్కును పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అందించారు. పోలీస్ సాలరీ ప్యాకేజ్ వర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రూపంలో పోలీస్ సాలరీ ప్యాకేజ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రూపంలో ఈ చెక్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ACP రాజా వెంకట్ రెడ్డి, SBI అధికారులు రవి కిరణ్, మహేశ్వర్ పాల్గొన్నారు.


