News February 1, 2025

పార్వతీపురం R&B ఈఈగా సుబ్బారావు

image

పార్వతీపురం డివిజన్ ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కే.సుబ్బారావును నియమిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన సాలూరు ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పార్వతీపురం డివిజన్‌లో పోస్ట్ ఖాళీగా ఉండడంతో ఆయనను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

చారిత్రక వారసత్వం.. శ్రీరంగపురం ఆలయ విశిష్టత

image

వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మితమైన శ్రీరంగపూర్ శ్రీరంగనాథస్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీరంగం తమిళనాడు వెళ్లలేని భక్తుల కోసం వనపర్తి రాజులు ఇక్కడ రంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారు శేషతల్పంపై పవళించిన భంగిమలో దర్శనమిస్తారు. విజయనగర శిల్పకళా రీతిలో నిర్మించిన ఈ ఆలయం, సంస్థానాధీశుల భక్తికి నిదర్శనం. # నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

News February 25, 2026

WGL: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 96% మంది హాజరు

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు వరంగల్ జిల్లాలో 96 శాతం విద్యార్థులు హాజరుకాగా, హనుమకొండ జిల్లాలో 97 శాతం విద్యార్థులు హాజరయ్యారు. వరంగల్‌లో 6,447 మందికి గాను 6,185 మంది విద్యార్థులు హాజరయ్యారు. హనుమకొండలో 19,638 మందికి 19,099 మంది హాజరయ్యారు. రెండు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 76 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DIEOలు శ్రీధర్ సుమన్, గోపాల్ తెలిపారు.

News February 25, 2026

పార్వతీపురం: నేటి నుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ క్లీనిక్

image

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ క్లీనిక్స్ ప్రారంభం కావాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం పార్వతీపురం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇకపై ప్రతీ గురువారం VROలు ఆయా గ్రామాల్లో రెవిన్యూ క్లీనిక్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రజల రెవెన్యూ సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యం అన్నారు.