News October 19, 2025
పార్శిల్ బుక్ చేసిన వారిపై కఠిన చర్యలు: పార్వతీపురం ఎస్పీ

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బాణసంచా <<18051111>>సామాగ్రి పేలుడు<<>> ఘటనా స్థలాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పరిశీలించారు. దర్యాప్తు చేసి, బస్సులలో పార్సిల్ సర్వీసు ద్వారా నిషేధిత మందుగుండు సామాగ్రి బుక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విజయనగరం నుంచి ఫ్యాన్సీ ఐటమ్స్ పేరుతో కొరియర్ వచ్చినట్లు గుర్తించారు.
Similar News
News October 19, 2025
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

దీపావళి పండుగను పల్నాడు జిల్లా ప్రజలు ఆనందోత్సవాల మధ్య అంగ రంగ వైభవంగా జరుపుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపు నిచ్చారు. చిన్న పిల్లల, పెద్దలు బాణాసంచా కాల్చే విషయంలో, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ కాలుష్య రహిత, ప్రజాహిత, ప్రజలకు ఇబ్బందిలేని పండగ జరుపుకోవాలని కలెక్టర్ కోరారు
News October 19, 2025
ఉప ముఖ్యమంత్రి, మంత్రికి PDPL MP లేఖలు

SC, ST విద్యార్థుల విద్యాపరమైన సంక్షోభంపై చర్యలు తీసుకోవాలని DY.CM భట్టి విక్రమార్కకు, మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు ఎంపీ వంశీకృష్ణ లేఖలు రాశారు. ప్రైవేట్ పాఠశాలలకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. విద్యార్థులకు విద్యలో అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. బీఎస్‌ఎస్‌ఎస్ పథకం పాఠశాలలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. భవిష్యత్ నిధుల విడుదలకు పారదర్శకమైన, సమయబద్ధమైన విధానం రూపొందించాలని MP విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
వరంగల్‌లో పేకాట రాయుళ్ల నుంచి రూ.3.68 లక్షలు స్వాధీనం

వరంగల్ కొత్తవాడ ప్రాంతంలోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి, పేకాడుతున్న 13 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. నిందితుల నుంచి రూ.3 లక్షల 68 వేలు నగదు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.