News February 26, 2025

పాలకుర్తిలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డీపీఓ 

image

పాలకుర్తిలోని మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను డీపీవో స్వరూప మంగళవారం పరిశీలించారు. ఆలయ ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు, తాగునీరు, చలువ పందిళ్లు, విద్యుత్తు సౌకర్యం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేసేలా దిశా నిర్దేశం చేశారు. అక్కడే ఉండి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.

Similar News

News February 26, 2025

సుల్తానాబాద్ : ప్రేమ పేరుతో వేధించిన యువకుడికి జైలు

image

సుల్తానాబాద్ మండలంలోని పూసాలకు చెందిన యువకుడికి జైలుశిక్ష పడింది. మియాపూర్ గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో ఇబ్బందికి గురిచేశాడని బాధితురాలు తండ్రికి తెలపడంతో అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువైనందున కోర్టు నెలరోజులు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించింది.

News February 26, 2025

NTR: ఎమ్మెల్సీ పదవి రేసులో విజయవాడ కీలక నేత..?

image

2025 మార్చిలోపు రాష్ట్రంలోని అయిదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఈ సారి విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాధకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.

News February 26, 2025

మహా శివరాత్రితో మహా కుంభమేళాకు తెర

image

ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక మహాకుంభ మేళా నేటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినంతో ఈ మహత్తర కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు 65 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చివరి రోజైన ఇవాళ 2 కోట్ల మంది రానున్నట్లు అంచనా.

error: Content is protected !!