News March 19, 2025

పాలకుర్తి: అనారోగ్యం కారణంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

image

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ మారుతినగర్లో మంగళవారం ఆరే అజయ్(23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బసంతనగర్ ఎస్సై స్వామి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Similar News

News March 19, 2025

IPL అభిమానులకు పోలీసుల సూచన!

image

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం నుంచి IPL మ్యాచులు జరగనున్నాయి. ఈక్రమంలో స్టేడియంలోకి తేకూడని వస్తువులను పోలీసులు సూచించారు. ‘కెమెరాలు& రికార్డింగ్ పరికరాలు, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ & ఎయిర్‌పాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె, కత్తులు, గన్స్, వాటర్ & ఆల్కహాల్ బాటిల్స్, పెట్స్, తినుబండారాలు, బ్యాగ్స్, ల్యాప్‌టాప్స్, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాక్యులర్, టపాసులు, డ్రగ్స్’ వంటివి తీసుకురాకూడదని పోలీసులు తెలిపారు.

News March 19, 2025

పశువుల షెడ్డులో 12 అడుగుల గిరినాగు..!

image

మాడుగులలో బుధవారం 12 అడుగుల భయంకరమైన గిరినాగు హల్ చల్ చేసింది. మాడుగుల మోదమాంబ కాలనీలో కనక అనే మహిళ ఈ గిరినాగును తన పశువుల షెడ్డులో చూసి భయాందోళన చెంది కుమారుడు గణేశ్‌కు విషయం చెప్పింది. దీంతో గణేశ్ స్నేక్ క్యాచర్ వెంకటేశ్‌కు సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా ఈ గిరి నాగును బంధించారు. ఈ గిరినాగును వంట్లమామిడి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని స్నేక్ క్యాచర్ వెంకటేశ్ తెలిపారు.

News March 19, 2025

HYDలో అచ్చంపేట యువకుడి ఆత్మహత్య 

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన మూడవత్ బాలు నాయక్ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆర్థిక ఇబ్బందులు, దానికి తోడు కుటుంబ కలహాలతో బాలు నాయక్ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!