News February 26, 2025
పాలకుర్తి: ఘనంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకుల వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆలయ ఈవో మోహన్ బాబు, ప్రజాప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 27, 2025
స్టేషన్ ఘనపూర్: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన రాజు-అపర్ణలు తమ తకూరు తపస్వి(4)తో కలిసి అపర్ణ తల్లిగారి ఊరైన స్టే.ఘ.లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడింది. గమనించిన అపర్ణ వెంటనే తన కూతురిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News February 27, 2025
రికార్డు సృష్టించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్‌లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక సీజన్‌లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. గతంలో 2002, 2017లో 10 శతకాలు నమోదయ్యాయి. ఈ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. 2006లో 7, 2000, 2009లో 6, 1998, 2004లో 4, 2013లో 3 శతకాలు నమోదయ్యాయి. కాగా ఇవాళ జరిగిన ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్ మ్యాచులో 2 సెంచరీలు వచ్చాయి. జో రూట్, ఇబ్రహీం జద్రాన్ శతకాలు బాదారు.
News February 27, 2025
వరంగల్ జిల్లాలో ఎంతమంది టీచర్స్ ఓటర్లు అంటే?

వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ MLC ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2352 మంది(పురుషులు 1474, స్త్రీలు 878) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 13 మండలాల్లో ఒక్కో మండల కేంద్రంలో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసామన్నారు.