News March 4, 2025
పాలకుర్తి: చాకలి ఐలమ్మ వారసుడిని కలిసిన పృథ్వీరాజ్

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా రాష్ట్ర క్రాంతి సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ ఆ విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 18, 2026
జనగామ పురపాలకలో పునరావృతమైన 1982

జనగామ పురపాలక చరిత్రలో 44 ఏళ్ల క్రితం జరిగిన రాజకీయ వాతావరణం మరోసారి జరిగింది. 1982లో మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో వీరారెడ్డి భాస్కర్ రెడ్డి, రొండ్ల లక్ష్మారెడ్డికి సమాన ఓట్లు రావడంతో లాటరీ విధానంలో డ్రా తీసి భాస్కర్ నిరెడ్డి ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. మళ్లీ నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతినే ఛైర్మన్ ఎన్నిక జరిగింది.
News February 18, 2026
నరసాపురం: పెళ్లైన విషయం దాచి బాలికతో ప్రేమ.. చివరికి..!

నరసాపురం రుస్తుంబాదకు చెందిన వివాహితుడు కొవ్వెల కళ్యాణ్, తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఓ బాలికను రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు తరలించినట్లు DSP డా.శ్రీవేద తెలిపారు. నరసాపురం టౌన్ SI సీహెచ్ జయలక్ష్మి కేసు నమోదు చేశారు.
News February 18, 2026
కాసేపట్లో విజయవాడలో పర్యటించనున్న YS జగన్

మాజీ CM YS జగన్ మరికాసేపట్లో విజయవాడలోని గొల్లపూడిలో పర్యటించనున్నారు. YCP MLC తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపేందుకు 11:30 గంటలకు గొల్లపూడిలోని రఘురాం నివాసానికి వస్తారు. ఆయన వెంట ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలు రానున్నట్లు అధికారికంగా సమాచారం వెలువడింది.


