News February 13, 2025
పాలకుర్తి: తండ్రికి తల కొరివి పెట్టిన ఐదేళ్ల చిన్నారి

జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన నాగన్న(30) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అభం శుభం తెలియని తన కూతురు రితీక(5) ‘నాన్న లే నాన్నా’ అంటూ బుధవారం కుటుంబ సభ్యుల సమక్షంలో నాగన్న చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన చూసిన గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు.
Similar News
News December 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 15, 2025
దేశంలోనే వృద్ధ ఎమ్మెల్యే కన్నుమూత

దేశంలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా పేరొందిన శామనూరు శివశంకరప్ప(95) మరణించారు. కర్ణాటకలోని దావణగెరె సౌత్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో మరణించారని వైద్యులు తెలిపారు. 1969లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకరప్ప MPగానూ పనిచేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతిపై పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు.
News December 15, 2025
సిరిసిల్ల: రెండో విడతలో ఎవరికి ఎన్ని సీట్లంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో బోయినపల్లి, తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట మండలాలలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 88 గ్రామ పంచాయతీలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 40 స్థానాలలో విజయం సాధించారు. ప్రతిపక్ష భారాస బలపరిచిన అభ్యర్థులు 30 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 6 చోట్ల, సీపీఎం 1, ఇతరులు 11 స్థానాలలో గెలుపొందారు.


