News February 18, 2025
పాలకుర్తి నియోజకవర్గంలో 6 నూతన చెక్ డ్యాములు మంజూరు

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినతికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పాలకుర్తి మండలంలో 3 గ్రామాలు, కొడకండ్ల మండలంలో 2 గ్రామాలు, తొర్రూరు మండలంలో 1 గ్రామానికి మొత్తం రూ.31 కోట్లతో 6 చెక్ డ్యాములను మంత్రి మంజూరు చేశారు. ఈ సందర్భంగా MLA రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News March 13, 2025
సలహాలు, సూచనలు ఇవ్వండి: విశాఖ కలెక్టర్

ఈఆర్వో, డీఈవో, సీఈవో స్థాయిలో పరిష్కారంకాని ఏవైనా సమస్యలపై భారత ఎన్నికల సంఘానికి నేరుగా సూచనలు ఇవ్వొచ్చని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఆహ్వానం తెలుపుతూ ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ వివరించారు. రాజకీయ పార్టీలకు విడివిడిగా ఎన్నికల సంఘం లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.
News March 13, 2025
‘వైసీపీ ఉనికి కోసమే యువత పోరు చేపట్టింది’

నంద్యాల: రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ కేవలం ఉనికి కోసమే యువత పోరు కార్యక్రమం చేపట్టిందని యూనివర్సల్ స్టూడెంట్ యూత్ యూనియన్ అధ్యక్షుడు ముద్దం నాగ నవీన్ మండిపడ్డారు. యువత జీవితాలను నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడన్నారు. తన హయాంలో నిరుద్యోగ శాతం పెంచి.. ఇప్పుడు ఫీజు పోరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News March 13, 2025
స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమీక్ష

సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలు, క్రైం అగనెస్ట్ ఉమెన్, తదితర నేరాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భాగస్వామ్యులు కావాలని ఎన్జీవోల ప్రతినిధులకు ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమావేశం నిర్వహించారు. సమష్టిగా కృషి చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు.