News February 10, 2025

పాలకుర్తి: శ్రీ సోమేశ్వర జాతర వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 25 నుంచి మార్చి1 వరకు పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి జాతర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జాతరకు సంబంధించి వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆలయ అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 10, 2026

కామారెడ్డి: రోడ్డు నిబంధనలు పాటించాలి

image

వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు వాహన డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. రోడ్డు నిబంధనలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

News January 10, 2026

ఇరాన్ విప్లవం గురించి తెలుసా?

image

ఇరాన్ చివరి రాజు మహ్మద్ రెజా షా పహ్లావి 1941 నుంచి 1979 వరకు పాలించారు. ఆయిల్ నిల్వలను అమెరికా కంపెనీలకు కట్టబెట్టడం, పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోవడంతో మత పెద్దలు, ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. అయతుల్లా రుహొల్లా ఖమేనీ నాయకత్వంలో(1979) ఇస్లామిక్ విప్లవంతో రెజా దేశం విడిచి పారిపోయారు. ఖమేనీ US కంపెనీలను బహిష్కరించారు. మహిళలపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఖమేనీల పాలనపై <<18808619>>వ్యతిరేకత<<>> మొదలైంది.

News January 10, 2026

అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలకృష్ణ

image

అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ప్రకటించారు. అన్విత గ్రూప్ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో బాలకృష్ణ చేసిన సేవలు సమాజానికి ఆదర్శమని అచ్యుతరావు అన్నారు.