News December 14, 2025
పాలకుర్తి: సర్పంచ్ అభ్యర్థిపై కత్తిపోట్లు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న జనగామ మనోజ్ కుమార్ ను శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. తెల్లారితే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మనోజ్ కుమార్‌పై హత్యాయత్నం జరగడం వల్ల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సివుంది.
Similar News
News March 6, 2026
సివిల్స్ ఫలితాల్లో జనగామ యువకుడి సత్తా

సివిల్స్ ఫలితాల్లో జనగామ జిల్లాకు చెందిన భరత్ నాయక్ సత్తా చాటారు. 2023లో ఐఎఫ్ఎస్ కు సెలక్ట్ అయిన ఆయన తాజా ఫలితాల్లో 900వ ర్యాంక్ సాధించారు. ఐఐటి మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈ సందర్భంగా భరత్ నాయక్ తల్లిదండ్రులు బానోత్ దస్రు నాయక్, అనసూయ దంపతులను జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
News March 6, 2026
ఏసీలు కొనేవారికి షాక్

వేసవి ప్రారంభంలోనే ఏసీ ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే LG, హిటాచీ దాదాపు 5-7 శాతం రేట్లను పెంచాయి. రానున్న 3-10 రోజుల్లో బ్లూ స్టార్, వోల్టాస్, ఇతర బ్రాండ్లు 10-15 శాతం మేర ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. పెరిగిన ముడి సరకు ధరలను భర్తీ చేసుకోవడానికి కంపెనీలు వేసవి డిమాండ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యంగా AC కంప్రెసర్లు, కాయిల్స్‌లో వాడే <<19232225>>రాగి రేటు<<>> భారీగా పెరిగిన విషయం తెలిసిందే.
News March 6, 2026
ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కావాలి: భద్రాద్రి కలెక్టర్

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు సూచనలు చేశారు.


