News December 21, 2025
పాలకుర్తి: 111 ఏళ్ల వృద్ధురాలు మృతి

పాలకుర్తి మండలం బక్కరాజంపల్లికి చెందిన జాడి చంద్రమ్మ(111) వృద్ధాప్యంతో ఆదివారం మృతి చెందింది. చంద్రమ్మకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్ళు ఉండగా కుమారులు ముగ్గురు ఆమె కళ్ళముందే పలు కారణాలతో మృతి చెందారు. వీరందరికీ 16 మంది సంతానం ఉన్నారు. తమ ఊరిలో ఎక్కువ కాలం బ్రతికింది ఒక్క చంద్రమ్మేనని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు చంద్రమ్మ మృతదేహానికి నివాళులు అర్పించారు.
Similar News
News December 21, 2025
షాకింగ్.. బిగ్‌బాస్ విన్నర్ ప్రకటన!

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 విజేత ఎవరనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో విన్నర్ ఎవరో తెలియనుండగా ఆన్‌లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా ముందే విజేతను చెప్పేసింది. ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ అని పేర్కొంది. కాగా వికీపీడియాలో ఎవరైనా మార్పులు(ఎడిట్) చేసే అవకాశముంది. దీంతో కొందరు కావాలనే వ్యూయర్స్‌ను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి బిగ్‌బాస్ టీమ్‌తో ఎలాంటి సంబంధాలు ఉండవు.
News December 21, 2025
ములుగు: రేపు యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల నుంచి వినతుల స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించలేదన్నారు. కోడ్ ముగిసినందున ప్రతి సోమవారం వినతుల స్వీకరణ ఉంటుందని స్పష్టం చేశారు.
News December 21, 2025
రాజీ మార్గమే రాజా మార్గం: సివిల్ జడ్జి

రాజీయే రాజమార్గం అని, జాతీయ లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం పొందవచ్చని ASF సెషన్ సివిల్ జడ్జ్ యువరాజ అన్నారు. ఆసిఫాబాద్ కోర్టు ఆవరణలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 11,022 కేసులను పరిష్కరించి, రూ.55,62,865 జరిమానా విధించినట్లు తెలిపారు. క్షణికావేశంతో నమోదు చేసుకున్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృధా చేసుకోవద్దని సూచించారు.


