News February 19, 2025
పాలకొండకు జగన్ రాక రేపు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.
Similar News
News March 12, 2025
పలాస: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

పలాస మండలం సూదికొండ గ్రామానికి చెందిన దివ్యాంగుడు బుట్ట గంగాధర్ రావు(36), భార్య సరళ (30), సయ్యద్ ఫరీద్ (26) ముగ్గురు వ్యక్తులు ట్రై స్కూటీపై మంగళవారం ఒడిశా కోయిపూర్ గ్రామం వెళ్లి తిరిగి వస్తుండగా గారబంద వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఫరీద్, గంగాధర్ రావు తీవ్ర గాయాలతో మృతి చెందగా.. సరళకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గారబంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 12, 2025
శ్రీకాకుళం: 3 మండలాలకు రెడ్ అలర్ట్ జారీ

శ్రీకాకుళం జిల్లాలో రేపు బుధవారం 3 మండలాల్లో కింద పేర్కొన్న విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదై వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. వృద్ధులు, ఆరుబయట పనిచేసే కార్మికులు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక X ఖాతా ద్వారా రెడ్ అలర్ట్ జారీ చేసింది. *బూర్జ 39.9* హిరమండలం 40.2 *ఎల్.ఎన్.పేట 40.2
News March 11, 2025
SKLM: పార్లమెంటులో అరకు కాఫీ ఘుమఘుమలు

ఏపీలో గిరిజన ప్రాంతాలలో పండించే అరకు వ్యాలీ కాఫీ ప్రత్యేకతను పార్లమెంటులో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి లేఖ రాశారు. ఆ లేఖను మంగళవారం ఆయనకు అందజేశారు. సేంద్రీయ సాగైన అరకు కాఫీ గొప్ప రుచికి ప్రసిద్ధి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ‘మన్ కీ బాత్’ లో ఈ కాఫీ ప్రత్యేకతను ప్రశంసించారు.