News February 17, 2025

పాలకొండ: నేడు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ ఎన్నిక

image

పాలకొండ నగర పంచాయితీలో ఖాళీగా ఉన్న ఛైర్‌పర్సన్ పదవికి సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఇదివరకే పాలకొండ ఛైర్‌పర్సన్ పదవి కోసం రెండుసార్లు ఎన్నిక జరగ్గా వివిధ కారణాలు రీత్యా వాయిదా పడింది. దీంతో మూడోసారి ఈ ఎన్నిక నిర్వహించేందుకు నేడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిక కొలిక్కి వస్తుందా లేదా అని నగర పంచాయతీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News December 21, 2025

సీఎం జిల్లా నుంచే మాజీ సీఎం పోరుబాట

image

TG: రెండేళ్ల తర్వాత యాక్టివ్‌గా కనిపిస్తున్న కేసీఆర్ కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచే పోరాటం మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో అక్కడి నేతలతో సమావేశమవ్వడమే కాకుండా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అటు నదీజలాల విషయంలో కేంద్రంలోని బీజేపీపైనా ఫైట్ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ హామీలకు జనం టెంప్ట్ అయి ఓటేశారని, ఈ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదని ఫైరయ్యారు.

News December 21, 2025

బాపట్ల: కలెక్టర్ కుమారుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో..!

image

బాపట్ల కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ ఆదివారం స్థానిక ఏరియా వైద్యశాలను కుటుంబ సమేతంగా సందర్శించారు. తన కుమారుడికి స్వయంగా పోలియో చుక్కలు వేయించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

News December 21, 2025

KNR: కోడలితో ఎఫైర్.. కొడుకును హత్య చేయించిన తండ్రి

image

రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య (36) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో తండ్రి గాదె లచ్చయ్య, మృతుని భార్య శిరీష కలిసి రూ.3 లక్షలకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో తండ్రి, భార్యతో పాటు సుపారీ హంతకులు ఉప్పరపల్లి కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్, మధ్యవర్తి కొలిపాక రవిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.