News February 4, 2025
పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా

కోరం లేక పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. కాగా.. కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఈ ఎన్నిక పూర్తిగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికపై ఎలక్షన్ కమీషన్‌కు నివేదిక పంపిస్తున్నట్లు పాలకొండ మున్సిపల్ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు వెల్లడించారు.
Similar News
News February 5, 2026
‘వైద్య సేవల్లో నాణ్యత పెంచాలి’

సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బుధవారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లడ్ బ్యాంకుల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. మాతా-శిశు మరణాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలపై ఈ వారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని వెల్లడించారు. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలని ఆయన కోరారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం పాల్గొన్నారు.
News February 5, 2026
దేశంలో ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

దేశంలో డిజిటల్ సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అందరికీ ఆ ప్రయోజనాలు చేరడం లేదు. దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగా ఉంది. సుమారు 13.7% కుటుంబాలకు ఆన్‌లైన్ సదుపాయం లేదు. అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్‌గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఈ గ్యాప్ ఆందోళన కలిగిస్తోంది.
News February 5, 2026
T20WC: శాంసన్ కథ ముగిసినట్లేనా?

టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వార్మప్ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్‌కు రాకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో సంజూ టీమ్ మేనేజ్‌మెంట్‌నే కాదు.. అభిమానులను కూడా ఎంతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను T20WCలో అవకాశం కోల్పోనున్నారని, అందుకే వార్మప్ మ్యాచ్‌లోనూ కనిపించలేదని చెబుతున్నారు.


