News February 15, 2025
పాలకొల్లులో సందడి చేసిన జబర్దస్త్ అప్పారావు

జబర్దస్త్ నటుడు అప్పారావు శనివారం పాలకొల్లులో ఓ వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. జబర్దస్త్, పలు నాటికలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. వరుడి తండ్రి తన స్నేహితుడు కావడంతో ఈ వివాహానికి హాజరైనట్లు అప్పారావు తెలిపారు. ఆయన రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది. పలువురు సెల్ఫీలు దిగారు.
Similar News
News March 12, 2025
హైదర్‌బాద్‌లో ఉరిసేకున్న ప.గో జిల్లా యువకుడు

ప్రేమ విపలం అవ్వడంతో ప.గో జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోడూరుకు చెందిన రోహిత్ కూమార్ ఓల్డ్ హఫీజ్ పేటలో స్నేహితులో కలిసి ప్రెవేట్ ఉద్యోగం చేస్తు జీవిస్తున్నాడు. మంగళవారం కలతగా ఉండటంతో ట్యాబెలెట్స్ వేసుకుని పడుకున్నాని చెప్పాడు. స్నేహితులు విధులు ముగించుకుని తిరిగి వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 12, 2025
ప.గో: ఆరు యూనిట్లు ఇసుక ధర ఎంతో తెలుసా..!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుకకు డిమాండ్ తగ్గి ధరలు దిగోచ్చాయి. యూనిట్ ఇసుక రూ.10 వేలకే దొరుకుతోంది. జిల్లాలో భవన నిర్మాణాలు ఒక్కసారిగా మందగించడంతో ధర అందుబాటులో ఉన్నప్పటకి డిమాండ్ లేకపోవడంతో లారీ యాజామానులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ అభివృద్ధి పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. అయినప్పటికి అదనంగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నారని కనీసం రూ.2 వేలు మిగలడం లేదని వాపోతున్నారు.
News March 12, 2025
పేదలందరికీ ఇళ్ళు ఏర్పాటు దిశగా చర్యలు: కలెక్టర్

పేదలందరికీ ఇళ్ళు ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ప.గో జిల్లాలో 18,340 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బీసీలులు 12,362, ఎస్సీలు 5,593, ఎస్టీలు 385 లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటికి అదనంగా రూ.92.66 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.