News December 19, 2025

పాలకొల్లు: ఐఈఎస్‌లో సత్తాచాటిన లంకలకోడేరు యువతి

image

పాలకొల్లు మండలం లంకలకోడేరుకు చెందిన కవిత బేబీ బుధవారం రాత్రి విడుదలైన యూపీఎస్సీ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్ ) ఫలితాల్లో 48వ ర్యాంకుతో సత్తాచాటింది. తాను తొలిసారి 2024లో యూపీఎస్సీ పరీక్షకు హాజరై విఫలమయ్యానని, పట్టుదలతో కృషి చేసి ఇప్పుడు మంచి ర్యాంకు సాధించానని కవిత పేర్కొన్నారు. టెలీకమ్యూనికేషన్ శాఖలో ఉద్యోగం సాధించాలనేది తన ఆశయమన్నారు. కవితకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Similar News

News December 26, 2025

విజేతగా నిలిచిన భూపాలపల్లి జట్టు

image

HCA, వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ-20 క్రికెట్ లీగ్ పోటీల ఫైనల్ మ్యాచ్‌లో భూపాలపల్లి జట్టు విజేతగా నిలవగా, హనుమకొండ రన్నరప్‌గా నిలిచింది. ఉత్తమ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసిన క్రీడాకారులను క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి బహుమతులను అందజేశారు.

News December 26, 2025

వేములవాడ: నైవేద్యం తయారీలో సాంప్రదాయాలకు మంగళం

image

వేములవాడ రాజన్న ఆలయంలో నివేదన తయారీలో ఆలయ నైవేద్యశాల వంట మనిషి నిబంధనలను పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఫణి అనే వంట మనిషి మడికట్టు లేకుండానే లుంగీ, టీ షర్టు ధరించి, మొబైల్ చూస్తూ నివేదన వండుతున్న దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిన వైనంపై అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.

News December 26, 2025

MBNR: ప్రజా భద్రతే లక్ష్యం: ఎస్పీ

image

MBNR జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని, గత ఏడాదితో పోలిస్తే నేరాలు 5 శాతం తగ్గాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 2025 వార్షిక నేర నివేదికను ఆమె విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీ భద్రతతో ప్రశాంతంగా నిర్వహించామన్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా కేంద్రాల భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు.