News January 1, 2025

పాలకోడేరు: కేజీ మటన్ కొంటే కేజీ చికెన్ ఫ్రీ

image

కొత్త సంవత్సరం వేళ ఓ మాంసం వ్యాపారి భలే ఆఫర్ తీసుకొచ్చారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో కేజీ మటన్ కొంటే.. కేజీ చికెన్ ఫ్రీ అంటూ ఆఫర్ పెట్టారు. దీంతో మాంసం ప్రియులు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. అలాగే కేజీ చికెన్ కొంటే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అలాగే కేక్, బిర్యానీ కొన్న వారికి కూల్ డ్రింక్‌నూ ఉచితంగా అందించారు.

Similar News

News January 4, 2025

ప.గో: మంత్రి నాదెండ్లను కలిసిన దుర్గేశ్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు పలు శాఖా పరమైన అంశాలు చర్చించినట్లు తెలిపారు.

News January 3, 2025

ప.గో: ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై గ్రామసభలు

image

ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామసభలకు హాజరై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

News January 3, 2025

ఏలూరు: రేపటి నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు

image

శనివారం నుంచి ఏలూరు జిల్లాలో భోజన పథకం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం’ అనే పేరుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రారంభం కాబోతున్నది. దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థులు భోజనం చేయడానికి గిన్నెలు, గ్లాసులు, వంట పదార్థాలు సిద్ధం చేశామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ప్రభాకరరావు చెప్పారు. నారాయణపురం కాలేజీలో ఏర్పాట్లను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు.