News August 16, 2025
పాలకోడేరు: జెండాను ఆవిష్కరించిన ఎస్పీ

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు ఎస్పీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీస్ అధికారులు, సిబ్బంది, జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Similar News
News August 16, 2025
ఆకివీడు: కండక్టర్‌గా మారిన RRR

‘స్త్రీ శక్తి’ పథకాన్ని డిప్యూటీ స్పీకర్ RRR శుక్రవారం దుంపగడపలో ప్రారంభించారు. కండక్టర్‌గా మారి, కాసేపు మహిళలకు ఉచిత టికెట్లు ఇచ్చారు. ప్రభుత్వం మహిళాభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 297 బస్సులకు గాను 225 బస్సులు ఈ పథకంలో సేవలందిస్తున్నాయని, ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు.
News August 15, 2025
పాలకొల్లు: ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన మంత్రి

పాలకొల్లు బస్టాండ్‌లో మహిళల ఉచిత బస్సు ప్రయాణ ‘స్త్రీ శక్తి’ పథకాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు శివదేవుని చిక్కాల నుంచి కూటమి నేతలు, మహిళలతో కలిసి అలంకరించిన ఆర్టీసీ బస్సులో ఆయన సభాస్థలికి చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులు మంత్రికి స్వాగతం పలకగా, మహిళలు హారతులిచ్చారు. ఇచ్చిన హామిలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని మంత్రి అన్నారు.
News August 15, 2025
తణుకు: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

తణుకులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు వార్డులను సందర్శించిన ఆమె రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పలు విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్యుల కొరతను అడిగి తెలుసుకున్న ఆమె సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్, ఆర్ఎంవో డాక్టర్ తాతారావు పాల్గొన్నారు.