News January 14, 2026
పాలక్ పనీర్ తంటా: ఇండియన్ స్టూడెంట్స్‌కు ₹1.80 కోట్ల పరిహారం

USలోని కొలరాడో వర్సిటీలో వివక్షకు గురైన ఇండియన్ Ph.D విద్యార్థులు ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య న్యాయపోరాటంలో నెగ్గారు. క్యాంపస్‌లో 2023లో పాలక్ పనీర్ వేడి చేస్తున్న టైమ్‌లో సిబ్బంది ఆ వాసనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి వారి డిగ్రీలను నిలిపివేసే వరకు వెళ్లడంతో కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా వర్సిటీ వారికి దాదాపు ₹1.80 కోట్ల పరిహారం చెల్లించడంతో పాటు మాస్టర్స్ డిగ్రీలను అందజేసింది.
Similar News
News February 18, 2026
మెదక్ కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

TG: న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. అనంతరం తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపేసింది. అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు గడువిచ్చింది.
News February 18, 2026
ఫిబ్రవరి 18: చరిత్రలో ఈరోజు

1745: బ్యాటరీ ఆవిష్కర్త అలెస్సాండ్రో వోల్టా జననం
1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం (ఫొటోలో)
1939: ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మరణం
2002: ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్ జననం
2014: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2015: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణం
2023: నటుడు నందమూరి తారకరత్న మరణం
News February 18, 2026
ప్రముఖ బాలీవుడ్ నటి మృతి

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రవీణా దేశ్‌పాండే(60) కన్నుమూశారు. క్యాన్సర్‌తో చాలా కాలంగా బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. హిందీ, మరాఠీ సినిమాలతోపాటు టీవీ, వెబ్ సిరీసుల్లోనూ ఆమె నటించారు. సల్మాన్‌తో రెడీ మూవీతోపాటు ఏక్ విలన్, పరమాణు తదితర ఎన్నో మూవీల్లో కనిపించారు.


