News March 25, 2025
పాలమూరుకు మరో మంత్రి పదవి..!

పాలమూరు జిల్లాకు మరో మంత్రి రానుందని టాక్. మక్తల్ MLA వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో చర్చ అనంతరం మంత్రివర్గ విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. మార్చి30న ఉగాది పండగ రోజు కొత్త మంత్రులు రానున్నారు.కాగా ఉమ్మడి MBNR నుంచి CM రేవంత్ రెడ్డి (కొడంగల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) మంత్రులుగా ఉండగా శ్రీహరితో ఆ సంఖ్య 3కు చేరనుంది.
Similar News
News March 28, 2025
HYD: భవనం పైనుంచి దూకి వివాహిత సూసైడ్

భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు..భోలక్‌పూర్‌కు చెందిన శబరీష్‌తో సౌజన్యకు గత నవంబర్ 13న వివాహమైంది. నిత్యం భర్త, అత్తమామలు గొడవ పడుతూ ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కుటుంబీకులకు ఫోన్ చేసిన సౌజన్య.. గురువారం మధ్యాహ్నం భవనంపై నుంచి దూకింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయింది.
News March 28, 2025
నిర్మల్: మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది: ఎస్పీ

మీరు బాగుంటేనే సమాజం భద్రంగా ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజల శాంతి భద్రతలు కాపాడటంలో ఎండనకా వాననక నిరంతరం విధులు నిర్వహించే సిబ్బంది బాగుండాలని తెలిపారు. 30 ఏళ్ల వయసు పైబడిన 703 మంది పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
News March 28, 2025
మంచిర్యాల: పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ

నస్పూర్‌లోని సింగరేణి కాలరీస్ హైస్కూల్‌లో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్-2023 అమలులో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఆకుల అశోక్ పాల్గొన్నారు.