News October 29, 2025

పాలమూరుకు వాతావరణ శాఖ అలెర్ట్… సెల్‌ఫోన్‌లకు సందేశాలు

image

రాబోయే 3 గంటల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజలకు సెల్‌ఫోన్‌లకు సందేశాల (SMS) ద్వారా అలెర్ట్ జారీ చేస్తోంది. మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

Similar News

News October 29, 2025

VKB: భారీ వర్షాలు.. ఎస్పీ కీలక సూచనలు

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి అన్నారు.
✒పాతబడిన ఇండ్లు,శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఎవ్వరూ కూడా ఉండవద్దు.
✒వాగులను, కాలువలను, రోడ్డులను దాటే ప్రయత్నం చేయవద్దు
✒ఏదైనా అత్యవసరం ఉంటే వెంటనే ఆయా పోలీస్ స్టేషన్స్ అధికారులకు గాని, డైల్ 100కి గాని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712670056కు కాల్ చేయాలన్నారు.

News October 29, 2025

సిద్దిపేటలో కంట్రోల్ రూమ్‌.. ‘ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి’

image

భారీ వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. వర్షాల కారణంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఎమర్జెన్సీ నంబర్ 08457-230000కు కాల్ చేయాలని సూచించారు. బుధవారం ఆర్డీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.

News October 29, 2025

MHBD జిల్లాలో రేపు విద్యా సంస్థలకు సెలవు

image

మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా వర్షం తీవ్రంగా ఉండటంతో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు విద్యా సంస్థలకు రేపు సెలవు ప్రకటించినట్లు డీఈవో హెచ్ దక్షిణామూర్తి తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు నడుస్తున్నాయని బుధవారం, గురువారం జరిగే పరీక్షలు వాయిదా వేశారని, మిగతావి యథావిధిగా జరుగుతాయని అన్నారు.