News February 23, 2026

పాలమూరు:రైతు భరోసా.. ఎప్పుడొచ్చేనో?

image

ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. MBNR-2,44,853, NGKL-3,29,128, GDWL-1,79,052, WNPT-1,87,633, NRPT-1,90,153 మంది రైతులు ఉన్నారు. నవంబర్ లోనే రైతు భరోసా అందవలసి ఉండగా.. భూముల సర్వే (ధరణి) ప్రక్రియ, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News February 23, 2026

సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ఆనంద్

image

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. నగరంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫర్ గర్ల్స్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, మెడికల్ క్యాంపు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ వెల్లడించారు.

News February 23, 2026

పాలమూరు: అంబేడ్కర్ వర్సిటీ.. హాజరు కావాల్సిందే!

image

మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సైన్స్, కంప్యూటర్ విద్యార్థులకు ప్రయోగ తరగతులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మావతి, రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 80% హాజరు ఉండాలని, వివరాలకు 73829 29609ను సంప్రదించాలన్నారు.

News February 23, 2026

కల్తీ పాల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: జగన్

image

AP: రాజమండ్రి కల్తీ పాల <<19213441>>ఘటనపై<<>> మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని జగన్ పేర్కొన్నారు. కాగా కల్తీ పాల ఘటనపై CM చంద్రబాబు ఇప్పటికే కఠిన <<19215266>>చర్యలకు<<>> ఆదేశించారు.