News March 22, 2024
పాలమూరులో ఆపరేషన్ ఆకర్ష్..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో BRS పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారు.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, పురపాలిక చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు, MPTCలు BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆపరేషన్ ఆకర్ష్ మరింత వేగం అందుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 25, 2025
MBNR: బాధితులకు న్యాయం జరుగేలా చూడాలి: SP

MBNR జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కోర్ట్ డ్యూటీ, కోర్ట్ లైజన్ అధికారులతో ఎస్పి డి.జానకి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరుగేలా పోలీస్ అధికారులు సమయపాలన, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కోర్ట్ డ్యూటీ, లైజన్ అధికారులకు సంబంధిత ఫైళ్లు, సాక్షులు, పత్రాలు సమయానికి కోర్టులో సమర్పించే విధంగా స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
News October 25, 2025
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: కలెక్టర్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యం సాధించేందుకు కష్టపడి చదవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం హన్వాడ మండలంలో కెజీబీవీని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్వాడ మండల కేంద్రంలో కెజీబీవీని తనిఖీ చేశారు. ఆరో తరగతి విద్యార్థులతో విద్యా బోధన, భోజనం నాణ్యత ఇతర సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
News October 25, 2025
కౌకుంట్లలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కౌకుంట్లలో 82.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సల్కర్పేటలో 53.5, దేవరకద్రలో 42.0, మహమ్మదాబాద్లో 35.8, అడ్డాకులలో 34.5, హన్వాడలో 22.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది.


