News May 17, 2024

పాలమూరులో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం

image

సీఎం రేవంత్ సొంత ఇలాకా మహబూబ్‌నగర్ జిల్లా కావడంతో ఇక్కడ కాంగ్రెస్ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 2పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా 11 పర్యాయాలు స్వయంగా పర్యటించారు. ఇందులో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న MBNR పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా పలుసార్లు వచ్చారు. జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Similar News

News September 29, 2024

సీఎం ఫోటోలు కాదు.. 6 గ్యారంటీలు అమలు చేయండి: నిరంజన్ రెడ్డి

image

ప్రతీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అక్టోబర్ 7లోపు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని, కానీ ప్రభుత్వం వచ్చి 10నెలలైనా 6 గ్యారంటీల అమలుకు మాత్రం ఆదేశాలు లేవని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల అమలును పట్టించుకోని ప్రభుత్వం ఆగమేఘాల మీద సీఎం ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టేందుకు సిద్ధమవుతుందని విమర్శించారు. ఇదే తరహాలో 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News September 28, 2024

రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి జూపల్లి

image

పానగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశం ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

News September 28, 2024

MBNR: ‘డీసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోండి’

image

DEECET 2024లో ర్యాంకు పొందిన అభ్యర్థులు రెండేళ్ల DIEEd కోర్సులో అడ్మిషన్ పొందడానికి, ఇంకా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చూసుకోని విద్యార్థులు వెంటనే వెరిఫికేషన్ చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ మహమ్మద్ మేరాజుల్లాఖాన్ తెలిపారు. డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ బ్యాచ్ 2024-26 వారికి అక్టోబర్ 1న వెరిఫికేషన్ ఉంటుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.