News December 22, 2025
పాలమూరులో నేడు కొత్త సర్పంచుల పట్టాభిషేకం.!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పాలనలో నూతన అధ్యాయం మొదలుకానుంది. ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,678 పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు నేడు ప్రమాణస్వీకారం చేస్తారు. MBNR 423, NGKL 460, GWL 255, WNP 268, NRPTలోని 272 గ్రామాల్లో సందడి నెలకొంది. అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధులు పాలనా పగ్గాలు చేపట్టేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Similar News
News December 22, 2025
జగిత్యాల: టూరిజం ప్రోత్సాహక కార్యక్రమం

జగిత్యాల జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ చేతుల మీదుగా “100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ” పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. రాష్ట్రంలోని ప్రజలకు పెద్దగా తెలియని పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తేవడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని కలెక్టర్ అన్నారు. ఆసక్తిగల యువత 3 ఫొటోలు, 60 సెకన్ల వీడియోతో జనవరి 5, 2026లోపు ఎంట్రీలు పంపాలని కలెక్టర్ తెలిపారు.
News December 22, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఇలా ఉన్నాయు. అత్యధికంగా గాంధారి మండలంలో 9.7, రామ్ లక్ష్మణ్‌పల్లిలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, దోమకొండ, మాచారెడ్డి మండలాలలో 10.4, జుక్కల్, డోంగ్లి మండలాలలో 10.5, మహమ్మద్ నగర్ మండలంలో 10.6, పెద్దకొడుపగల్, పాల్వంచ మండలాలలో 10.7 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మిగతా మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 22, 2025
Credit Card Scam: లిమిట్ పెంచుతామంటూ..

‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అన్న చందంగా మారింది సైబర్ మోసగాళ్ల పని. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఈ మధ్య కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. కాల్స్, SMS, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. బ్యాంకు నుంచి లేదా క్రెడిట్ కార్డు సంస్థలకు చెందిన వాళ్లమని నమ్మబలుకుతారు. OTP, CVV వంటి కీలక సమాచారాన్ని లాగుతారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు పేరిట లింక్ పంపి బురిడీ కొట్టిస్తారు.


