News April 14, 2024
పాలమూరులో విమర్శల వార్

పాలమూరులోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి మొదలైంది. BRS, కాంగ్రెస్, BJP అభ్యర్థులు మాటలతూటాలు పేలుస్తున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలకు తెరలేపారు.10ఏళ్లలో పాలమూరుకు హోదా ఎందుకు తేలేదని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం 6గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. 10ఏళ్ల క్రితం.. పాలమూరు ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా మారిందో గమనించాలని బీఆర్ఎస్ అంటోంది.
Similar News
News March 6, 2026
MBNR: యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడిగుడ్ల ధరలు!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. NECC ఒక్క గుడ్డు ధర 4.30 ఉన్నప్పటికీ.. డిమాండ్ లేకపోవడంతో.. గుడ్డు ధర రూ.3.50 మాత్రమే పలుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో కోడిగుడ్ల ఎగుమతి లేదని పౌల్ట్రీ ఫారం యజమానులు అన్నారు. యుద్ధం వల్ల ఎగుమతి లేకపోవడంతో నిల్వలు పెరిగాయన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పౌల్ట్రీ ఫారం రైతులు తీవ్రంగా నష్టపోతామన్నారు.
News March 6, 2026
MBNR: అధిక ఎండలు.. ప్రజల బెంబేలు

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో.. చిన్న చింతకుంట మండలం నంది వడ్డేమాన్‌లో, కోయిలకొండ మండలం పారుపల్లిలో 38.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భూత్పూర్ 38.4, చిన్న చింతకుంట 38.1, అడ్డాకుల 38.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 37.9, కౌకుంట్ల, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, మూసాపేట మండలం జానంపేట 37.8, దేవరకద్ర 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News March 5, 2026
మహబూబ్‌నగర్: 254 మంది విద్యార్థులు గైర్హాజరు

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన మ్యాథమెటిక్స్ జువాలజీ హిస్టరీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 254 మంది గైర్హాజరైనట్టు జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. నేటి పరీక్షకు మొత్తంగా 10,156 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,902 విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష సందర్భంగా ఇటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.


