News March 17, 2026
పాలమూరు: ఆస్తి పన్ను చెల్లించలేదని ఫంక్షన్ హాల్ సీజ్

కల్వకుర్తి పట్టణ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారిపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నోటీసులు ఇచ్చినా స్పందించని వారి గృహాలు, వ్యాపార సముదాయాలకు తాళాలు వేసి సీల్ వేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే కుర్మిద్ద రోడ్డులోని రాయల్ ఫంక్షన్ హాల్ పన్ను బకాయి ఉన్నందున దానికి తాళం వేసి సీజ్ చేశారు.
Similar News
News April 5, 2026
15 ఏళ్లకే పోర్న్ సైట్‌లో నా ఫొటో పెట్టారు: జాన్వీ

డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల 15 ఏళ్లకే తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు హీరోయిన్ జాన్వీ కపూర్ వెల్లడించారు. పోర్న్ వెబ్‌సైట్‌లో తన మార్ఫ్‌డ్ ఫొటోలను అప్‌లోడ్ చేశారని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ‘తోటి స్టూడెంట్స్ ఆ సైట్స్ ఓపెన్ చేసినప్పుడు అవి కనిపించాయి. ఆ విషయాన్ని నాకు చెప్పడంతో బాధపడ్డా. సోషల్ మీడియాలో నైతికత లేదని అర్థమైంది. ఇప్పటికీ డీప్ ఫేక్ కారణంగా సమస్యలు వస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News April 5, 2026
SRH చెత్త రికార్డు

హైదరాబాద్ వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH చెత్త రికార్డులను మూటగట్టుకుంది. తొలి 10 ఓవర్లలో అత్యల్ప స్కోరు(35/4) చేసిన జట్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్-3లో KKR(31/3)vs డెక్కన్ ఛార్జర్స్, RR(32/5)vs RCB, MI(32/4)vsKXIP ఉన్నాయి. అలాగే సన్ రైజర్స్‌కు పవర్ ప్లేలో ఇదే నాలుగో లోయెస్ట్ స్కోర్(22/3). గతంలో 14/3vsRR, 20/3vsPBKS, 21/3vsRR అత్యల్ప స్కోర్లు చేసింది.
News April 5, 2026
రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’

భద్రాద్రి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులతో రావచ్చునని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం జరిగే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


