News January 24, 2026

పాలమూరు: ఉచిత పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు ఇచ్చే 5 నెలల ఉచిత శిక్షణ కరపత్రాలను పాలమూరు వర్సిటీ వీసీ ప్రొ.జి.ఎన్. శ్రీనివాస్ ఆవిష్కరించారు. డిగ్రీ అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈనెల 30లోగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు.
వెబ్‌సైట్: https://www.tsstudycircle.co.in

Similar News

News April 14, 2026

NZB: వేసవి ఉపశమనం.. ఉపాధికి ఊతం

image

ఎండలు మండిపోతుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోత తీవ్రమైంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎయిర్ కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్‌లో కొత్త కూలర్ల విక్రయాలు జోరందుకున్నాయి. పాత కూలర్లను బాగు చేయించేందుకు జనం దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఈ సీజన్ కారణంగా అటు విక్రయదారులు, ఇటు మరమ్మతుల ద్వారా మెకానిక్‌లకు చేతినిండా పని దొరుకుతూ ఉపాధి పొందుతున్నారు.

News April 14, 2026

భీమవరం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2026

850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు!

image

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనుంది. ఆర్టికల్ 55, 81కు సవరణలు చేపట్టనుంది. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిపైనా చర్చ జరగనుంది.