News January 22, 2026
పాలమూరు: ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్‌గా అంజయ్య

ఆర్టీసీ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్‌గా కల్వకుర్తి డిపోకు చెందిన అంజయ్య ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి బద్రియ, రాముడు, రామప్ప కూడా ఈ గుర్తింపు పొందారు. మొత్తం 10 డిపోల పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన 30 మంది డ్రైవర్లను ఎంపిక చేసి ప్రశంసా పత్రాలు అందజేసినట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు.
Similar News
News February 21, 2026
జగిత్యాల: ఉపాధ్యాయుల సర్వీసు వివరాల పరిశీలన

జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 26 నుంచి 28 వరకు, అలాగే మార్చి 2న సర్వీసు వివరాల పరిశీలన నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. జగిత్యాల (అర్బన్) ఎంఆర్సీలో ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్, ధ్రువపత్రాలు, నిర్ణీత ప్రొఫార్మాలతో తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
News February 21, 2026
మదనపల్లె మృగాడు మృతి.. CM ఏమన్నారంటే?

AP: మదనపల్లె హత్యాచార నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై CM చంద్రబాబు వినుకొండ సభలో స్పందించారు. ‘మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికొస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించా. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్న భయంతో అతను ప్రాణాలు తీసుకున్నాడు’ అని చెప్పారు. ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబీకులు ముందుకు రాని విషయం తెలిసిందే.
News February 21, 2026
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: ప్రశ్నాపత్రాల తరలింపు

జనగామ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్‌లకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశ్నాపత్రాలను అందజేశారు. పోలీసు బందోబస్తు నడుమ వీటిని నిర్దేశించిన కేంద్రాలకు తరలించారు. పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.


